ఇప్పుడు ఉన్న కుల ప్రాతిపదికగా రిజర్వేషన్లలో నాకు అనిపించిన కనిపించిన కొన్ని లొసగులు
రిజర్వేషన్ల గురించి కులాలలో ఆర్దికంగా క్రింద ఉన్నవారు పోరాడి ధర్నాలు చేసి ఎక్కువ శాతం సంపాదిస్తారు కాని, ఆర్దికంగా బాగా ఉన్నవారు కనీసం బయటకు కూడారారు, వాళ్ళకున్న డబ్బుతో కాన్వెంటులలో చదివి మొత్తం సీట్లు వాళ్ళేనిండిపోతారు, ఈ విషయంగురించి ఎప్పుడన్నా ఆలోచించారా?
అదే ఆర్దిక ప్రాతిపదికగా రిజర్వేషన్లలో ఈ లొసగు కనిపించదు. మీరు నిజంగా ఒకసారి చూడండి తక్కువకులాలలో ఆర్దికంగా వెన్కబడినవారు ఒక్కశాతం కూడా లబ్దిపొందుటలేరు. ఇంకొక విషయం, ఆర్దిక ప్రతిపాదికన వందశాతం రిజర్వేషన్లు అమలు పరిచినా ఒక్కగొడవ జరుగదు, ఒక్క ధర్నా జరుగదు ఎందుకంటె డబ్బు ఉన్నవారికి వీటిగురించి ఆలోచించే ఓపిక తీరిక ఉండదు, ఎలాగు వారి దగ్గర చాలా డబ్బు ఉంటదికాబట్టి వారికి అన్యాయంజరుగుతున్నదని బావించరు.
ఆర్దిక ప్రతిపాదిక రిజర్వేషన్లు అమలు జరపక పొవటంవలన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పేదవాడు పేదవానిగానె మరియు ఉన్నవాడు ఉన్నవాడుగానే మిగిలి పోతున్నారు, ఎందుకంటె ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ల లొసుగువల్ల, వెనుకబడిన కులలా పేరిట రిజర్వేషన్లు ఇస్తె మొత్తం ధనికులే వాటిని భర్తి చేస్తున్నారు.
Friday, June 20, 2008
Saturday, April 12, 2008
ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు
ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు అని ఈ రోజు వార్తలో చుసాను, ఇది చాలా శుబపరిణామం, అందులోనే ఒక వాక్య చదివా "కానీ చిరంజీవి ఆ వైఖరి తీసుకుంటే తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందని సోషలిస్టు నాయకులు భావిస్తున్నారు. చిరంజీవి ఏ సామాజిక నేపధ్యం నుంచి వచ్చారో దానిని విస్మరించి, విజయవంతం కాని కమ్యూనిస్టు భావ జాలాన్ని అనుసరించడం మంచిది కాదని వీరి అభిప్రాయం", ఈ వాక్య గురించి నేను చెప్పదలుచుకున్నది కమ్యూనిస్టు వారు సమసమాజం రావాలి అని కులాలు వద్దు అని చెప్పి చివరికి దళితులు అనుగదొక్కబడుతున్నారు, దళితులకి న్యాయం జరగటమలేదు అని అంటున్నారు, ఈ కమ్యూనిస్టు పార్టి అనునది, ఒక దళిత కులపార్టిగానే ఇండియాలో ఉండిపోయినది కాని, ఆర్దికంగా వెనుకబడినవారికి చేదోడుగా ఉండే పార్టిగా స్థాణం సంపాదించుకోలేక పోయింది, చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కమ్యునిజంతో పోల్చటం సరికాదు. ఇంకా నేను ఒకరాజకియ నాయకునిగా ఆలోచిస్తె, నాకు కావలసినది పదవి, కాబట్టి నాకు అన్ని కులాల ఓట్లు రావాలి అని, దేశాన్ని కులాలుగా విబజించను,కాని ఇండియాలో ఒక రాజకియ నాయకుడు పదవిలోకి రావాలి అంటె మద్యతరగతి వాళ్ళ ఓట్లు చాలా ముఖ్యం, కాబట్టి ఒక రాజకియ నాయకునిగా నేను చిరంజీవికి (ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్ల నాయకునికి) ఇచ్చు సలహ ఏమిటంటె, ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇచ్చునప్పుడు, మీరు తప్పకుండా మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకోవాలి, అంటె ఇప్పుడు కులాలలో కనుక Sc St Bc ఎలాగనో ఆర్దికంగా కూడా అలా విబజించి తక్కువ ఆదాయం ఉన్నవారిని సాధ్యమయినంత త్వరలో ఎక్కువ ఆదాయం కేటగిరిలోకి వచ్చునట్లు చూడాలి, ఇలా చేసుకుంటు పోతె ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి.ఇంకపోతె ఆర్దికంగా తక్కువ ఉన్నవారిని మళ్ళీ ఎందుకు విబజించ మన్నాను అంటె, ఎప్పుడయితె మనము మద్యతరగతి వారిని క్రింది తరగతివారితో కలిపితె, మద్యతరగతి వారు మొత్తం రిజర్వేషన్లు బర్తిచేస్తారు, అప్పుడు క్రింది తరగతివారి అబివృద్ది కుంటు పదుతుంది.కాబట్టి సాద్యమయినంత త్వరలో క్రిందితరగతి వారిని మద్యతరగతిలో చేరిస్తె తరువాత క్రింది తరగతివారు ఉండరు కాబట్టి, అప్పుడు మొత్తం రిజర్వెషన్లు మద్యతరగతివారికి వర్తిస్తాయి.
ఇకపోతె ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు అన్ని అందులో చేరుతాయని, జనాలకు అర్దమయే విదంగా ప్రచారం చేయాలి.ఎందుకంటె ఎలాగు ఇప్పూడు ఉన్న తక్కువ కులాల వారి ఆదాయం తక్కువగానే ఉంటుంది కాబట్టి వారికి ఏమి అన్యాయంజరగదు, దీనిగురించి బాగా ప్రచారం చేయాలి, మధ్యతరగతి వారిని మాత్రం అసలు మరువరాదు.
ఇకపోతె ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు అన్ని అందులో చేరుతాయని, జనాలకు అర్దమయే విదంగా ప్రచారం చేయాలి.ఎందుకంటె ఎలాగు ఇప్పూడు ఉన్న తక్కువ కులాల వారి ఆదాయం తక్కువగానే ఉంటుంది కాబట్టి వారికి ఏమి అన్యాయంజరగదు, దీనిగురించి బాగా ప్రచారం చేయాలి, మధ్యతరగతి వారిని మాత్రం అసలు మరువరాదు.
కుల ప్రతిపాత్తిక రిజర్వేషన్లు
రిజర్వేషన్లు కులం పరంగా ఇవ్వటం ఎంతవరకు సమంజసమో ఆలోచించడి, నా ఉద్దేశంలో రిజర్వేషన్ అనునది వెనుకబడిన వారికి చేయూతనిచ్చి ముందుకు నడిపించునది, నేను చాలామందిని పరిశీలించి చూసాను ఈ కులాల వారు మాత్రమే చాలా వెనుకబడి ఉన్నారు వీరికి తప్పకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటారు, కులం అనునది చేసే పనికి సంబందించినది ఇప్పుడు ఎంతమంది కుల వృత్తి చేస్తున్నారు చెప్పండి వారిది ఆ కులం అనటానికి, నా ఉద్దేశ్యంలో కుల వృత్తి చేయని వారికి అసలు కులమే లేనట్లు. కొన్ని కులాల వారు చాలా కాలం నుండి అనుగద్రొక్క బడి ఉన్నారు అంటారు నేను దీని మీద చెప్పదలుచుకున్నది, మీరు చెప్పేది నిజమే కాని రిజర్వేషన్లు అనునవి కులం ఆదారంగా కాకుండా కుటుంబ స్థితిగతులను బట్టి ఉండాలి అని నా ఉద్దేశ్యం ఈ విదంగా కొన్ని రోజులకి అసలు ఎవరిది ఏ కులొమో మరిచి అంతా కలసి ఉండటానికి ఆస్కారం ఉంటది, ఇంకా అనుగబడ్డ కులాలకు అన్యాయం జరుగుతున్నదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎందుకంటె వెనుకబడిన వారి ఆదాయం ఎలాగు తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళే రిజర్వేషన్ లో ముందు ఉంటారు, ఒకసారి ఆ కుటుంబం ఒక స్థాయికి వచ్చాక వారు రిజర్వేషన్ కి అనర్హులవుతారు, ఆలోచించండి డబ్బు బాగా ఉన్నవారిని గాని లేక ఉన్నత స్థాయిలో ఉన్నవారిని గాని ఎవరన్నా కులం గురించి పట్టించు కుంటున్నారా, మిమ్ములని ఒక వెనుకబడ్డ కులం కలెక్టరో లేక మంత్రో పిలిస్తె పొకుండా ఉంటారా? అదె వెనుక బడ్డ మంత్రినో లేక కలక్టర్ నో ఒక గుడిసెలో ఉండే ఉన్నత జాతి వాడు పిలిస్తె వెళ్తారా? నేను కులాలు రూపుమాపాలి అంటునే తక్కువ జాతి ఎక్కువ జాతి అని వాడుతున్నాను ఎందుకంటె ఈ విషయాన్ని విషదీకరించటానికి. ఈ కుల పిచ్చి పోతె మన భారతం లో కూడా పోటి పడి కష్టపడి ఒకరిని మించి ఒకరు డబ్బు సంపాదించి ప్రపంచంలో ఏ దేశానికి అందనంత ఎత్తుకు ఎదుగుతారు, ఎందుకంటె అప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటె వారే ఉన్నత కులం వారు కదా!
Friday, April 11, 2008
భారతం లో కులాలు
ప్రపంచము లో ఎక్కడ లేని కుల ప్రతిపాత్తిక భారతంలో ఎలా వచ్చినదో కాని, ఇది చాలా మంచి విషయం కొన్ని రోజుల క్రితం వరకు. ఎవరు ఏ పని చేయాలొ చాలా నిర్దిష్టముగా నిర్ణయించబడేది, అందరు ఆ పనులలో బాగ ప్రావిన్యం సంపాదించే వారు ఎందుకంటె చిన్న నాటి నుండి ఆ వాతావరణం లో పెరిగే వారు కాబట్టి. ఇంకా అంటరాని తనము అంటె అందులో వారు చేసే పనిని బట్టి నిర్ణయించి ఉంటారు, ఇప్పటికి చూడండి మనము చెప్పులు లేకుండా నడవలేము అని వాటిని వంటి ఇంట్లో పెట్టుకోలేము కదా, అలానే ఎప్పుడు చెప్పులు చేసుకుంటా ఉంటె ఎన్నో క్రీములు ఉంటాయి, వారిని ముట్టుకుంటె మనకు కూడా అంటుతాయి కదా ఆలోచించడి. ఇప్పటికయినా మీరు గొప్ప జాతి వారు కావొచ్చు మీరు బురదలో పడ్డారు అనుకండి మిమ్ములను ఎవరన్నా ముట్టుకుంటారా చెప్పండి, అంత ఎందుకు మీరు మీచేతులతో చెప్పులు తీసి పక్కన పెట్టి మీ ఎదుటి వ్యక్తి కి కరచాలనం ఇవ్వటానికి ప్రయత్నించడి మీరు కూడా అంటరాని వారు అయిపోతారు, మీ చెప్పులు ముట్టుకుంటేనే అలా ఉంటె అందరి చెప్పులను ముట్టుకోని పని చేసే వారిని దూరం ఉంచటంలో తప్పేమిటి మీరు ఆలోచించడి. ఇప్పటి వరకు నేను చెప్పినది కొన్ని రోజుల క్రితం సంగతి, మరి ఇప్పటి విషయానికి వద్దాం. ఇప్పుడు కులానికి చేసే పనులకి అసలు సంబందం లేదు, చెప్పులన్ని కర్మాగారాల లోనే తయారు అవుతున్నాయి, ఆ కార్మికుల కులమేమిటో చెప్పగలరా, ఒకసారి ఇంటికి వచ్చి స్నానం చేస్తే మొత్తం శుబ్రం అయి పొతది. నాకు తెలిసి ఇప్పుడు అంటరాని తనముని ఎవరు పాటించటమ లేదు, ఒక సారి పాఠశాల లో చేరిన తరువాత కులం గురంచి ఆలోచనే రాదు.
నా ఉద్దేశ్యం లో ఈ కులాల గొడవలు తగాదాలు పొవాలంటె, కులం అను పదం ను అన్ని ఫామ్స్ నుండి తొలగించాలి, ఇప్పుడు కాలేజి లో చేరిన తరువాత ముందు నీ ర్యాంకు ఎంత అని అడుగుతారు ఎందుకంటె కులం గురంచి అడిగితె కోపం వస్తది కదా, ర్యాంకుని బట్టి లేదా మర్కులని బట్టి వారి కులాన్ని అంచనా వేస్తున్నారు. అసలు అధికారికంగా కులం అనే పదాన్ని బ్యాన్ చేసినప్పుడే భారత్ కి పట్టిన సగం ధరిద్రం వదులుతుంది.
నా ఉద్దేశ్యం లో ఈ కులాల గొడవలు తగాదాలు పొవాలంటె, కులం అను పదం ను అన్ని ఫామ్స్ నుండి తొలగించాలి, ఇప్పుడు కాలేజి లో చేరిన తరువాత ముందు నీ ర్యాంకు ఎంత అని అడుగుతారు ఎందుకంటె కులం గురంచి అడిగితె కోపం వస్తది కదా, ర్యాంకుని బట్టి లేదా మర్కులని బట్టి వారి కులాన్ని అంచనా వేస్తున్నారు. అసలు అధికారికంగా కులం అనే పదాన్ని బ్యాన్ చేసినప్పుడే భారత్ కి పట్టిన సగం ధరిద్రం వదులుతుంది.
Subscribe to:
Posts (Atom)