Saturday, April 12, 2008
కుల ప్రతిపాత్తిక రిజర్వేషన్లు
రిజర్వేషన్లు కులం పరంగా ఇవ్వటం ఎంతవరకు సమంజసమో ఆలోచించడి, నా ఉద్దేశంలో రిజర్వేషన్ అనునది వెనుకబడిన వారికి చేయూతనిచ్చి ముందుకు నడిపించునది, నేను చాలామందిని పరిశీలించి చూసాను ఈ కులాల వారు మాత్రమే చాలా వెనుకబడి ఉన్నారు వీరికి తప్పకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటారు, కులం అనునది చేసే పనికి సంబందించినది ఇప్పుడు ఎంతమంది కుల వృత్తి చేస్తున్నారు చెప్పండి వారిది ఆ కులం అనటానికి, నా ఉద్దేశ్యంలో కుల వృత్తి చేయని వారికి అసలు కులమే లేనట్లు. కొన్ని కులాల వారు చాలా కాలం నుండి అనుగద్రొక్క బడి ఉన్నారు అంటారు నేను దీని మీద చెప్పదలుచుకున్నది, మీరు చెప్పేది నిజమే కాని రిజర్వేషన్లు అనునవి కులం ఆదారంగా కాకుండా కుటుంబ స్థితిగతులను బట్టి ఉండాలి అని నా ఉద్దేశ్యం ఈ విదంగా కొన్ని రోజులకి అసలు ఎవరిది ఏ కులొమో మరిచి అంతా కలసి ఉండటానికి ఆస్కారం ఉంటది, ఇంకా అనుగబడ్డ కులాలకు అన్యాయం జరుగుతున్నదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎందుకంటె వెనుకబడిన వారి ఆదాయం ఎలాగు తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళే రిజర్వేషన్ లో ముందు ఉంటారు, ఒకసారి ఆ కుటుంబం ఒక స్థాయికి వచ్చాక వారు రిజర్వేషన్ కి అనర్హులవుతారు, ఆలోచించండి డబ్బు బాగా ఉన్నవారిని గాని లేక ఉన్నత స్థాయిలో ఉన్నవారిని గాని ఎవరన్నా కులం గురించి పట్టించు కుంటున్నారా, మిమ్ములని ఒక వెనుకబడ్డ కులం కలెక్టరో లేక మంత్రో పిలిస్తె పొకుండా ఉంటారా? అదె వెనుక బడ్డ మంత్రినో లేక కలక్టర్ నో ఒక గుడిసెలో ఉండే ఉన్నత జాతి వాడు పిలిస్తె వెళ్తారా? నేను కులాలు రూపుమాపాలి అంటునే తక్కువ జాతి ఎక్కువ జాతి అని వాడుతున్నాను ఎందుకంటె ఈ విషయాన్ని విషదీకరించటానికి. ఈ కుల పిచ్చి పోతె మన భారతం లో కూడా పోటి పడి కష్టపడి ఒకరిని మించి ఒకరు డబ్బు సంపాదించి ప్రపంచంలో ఏ దేశానికి అందనంత ఎత్తుకు ఎదుగుతారు, ఎందుకంటె అప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటె వారే ఉన్నత కులం వారు కదా!
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఈ టాపిక్ చాలా హాట్ గురూ. ఎంతమాట్లాడుకున్నా తెగదు. ఒక సుత్రానికి కానీ, ఒక పరిష్కారానికి కానీ ఇంతకుముందు కొట్టుకున్న వారురాలేక పొయారు.
ఎవరో పెద్దాయన అన్నట్లు భారత దేశమనేది ఒక ప్రిస్మాటిక్ సొసైటీ అంటే ఒక పట్టకం కాంతిని ఒకవైపు వర్ణాలుగా విడగొడుతీ మరొక వైపు విడగొట్టబడని స్వచ్చమైన కాంతిని కూడా చూపిస్తుంది.
అంటే ఎన్ని వైవిధ్యాలునా చాలాసందర్భాలలో మనసమాజం ఏకత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఏకత్వాన్ని ప్రదర్శించే సందర్భాలు, యుద్ధం కావొచ్చు, పేదరికం కావొచ్చు, మోసాలు కావొచ్చు, డబ్బు కావొచ్చు, నేరాలు కావొచ్చు, అవినీతి కావొచ్చు, అధికారం కావొచ్చు ఏదైనా కావొచ్చు.
life is like that what can we do?
not only here life is like that every where - isnt it?
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
మీరు తీసుకున్న టాపిక్, దాని విశిదికరణ బాగున్నాయి. కాని విషయమ్మిద ఎంత చెర్చించినా చర్వితచరణమే అవుతుంది. ఈ దుర్నితి ఆరాచకీయుల ఓటుబ్యాంకు కార్యకలాపాలు సాగినంత కాలం మీ వేదన అరణ్యఘోషె అవుతుంది.
Post a Comment