Saturday, April 12, 2008

ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు

ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు అని ఈ రోజు వార్తలో చుసాను, ఇది చాలా శుబపరిణామం, అందులోనే ఒక వాక్య చదివా "కానీ చిరంజీవి ఆ వైఖరి తీసుకుంటే తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందని సోషలిస్టు నాయకులు భావిస్తున్నారు. చిరంజీవి ఏ సామాజిక నేపధ్యం నుంచి వచ్చారో దానిని విస్మరించి, విజయవంతం కాని కమ్యూనిస్టు భావ జాలాన్ని అనుసరించడం మంచిది కాదని వీరి అభిప్రాయం", ఈ వాక్య గురించి నేను చెప్పదలుచుకున్నది కమ్యూనిస్టు వారు సమసమాజం రావాలి అని కులాలు వద్దు అని చెప్పి చివరికి దళితులు అనుగదొక్కబడుతున్నారు, దళితులకి న్యాయం జరగటమలేదు అని అంటున్నారు, ఈ కమ్యూనిస్టు పార్టి అనునది, ఒక దళిత కులపార్టిగానే ఇండియాలో ఉండిపోయినది కాని, ఆర్దికంగా వెనుకబడినవారికి చేదోడుగా ఉండే పార్టిగా స్థాణం సంపాదించుకోలేక పోయింది, చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కమ్యునిజంతో పోల్చటం సరికాదు. ఇంకా నేను ఒకరాజకియ నాయకునిగా ఆలోచిస్తె, నాకు కావలసినది పదవి, కాబట్టి నాకు అన్ని కులాల ఓట్లు రావాలి అని, దేశాన్ని కులాలుగా విబజించను,కాని ఇండియాలో ఒక రాజకియ నాయకుడు పదవిలోకి రావాలి అంటె మద్యతరగతి వాళ్ళ ఓట్లు చాలా ముఖ్యం, కాబట్టి ఒక రాజకియ నాయకునిగా నేను చిరంజీవికి (ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్ల నాయకునికి) ఇచ్చు సలహ ఏమిటంటె, ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇచ్చునప్పుడు, మీరు తప్పకుండా మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకోవాలి, అంటె ఇప్పుడు కులాలలో కనుక Sc St Bc ఎలాగనో ఆర్దికంగా కూడా అలా విబజించి తక్కువ ఆదాయం ఉన్నవారిని సాధ్యమయినంత త్వరలో ఎక్కువ ఆదాయం కేటగిరిలోకి వచ్చునట్లు చూడాలి, ఇలా చేసుకుంటు పోతె ఎంత బాగా ఉంటుందో ఆలోచించండి.ఇంకపోతె ఆర్దికంగా తక్కువ ఉన్నవారిని మళ్ళీ ఎందుకు విబజించ మన్నాను అంటె, ఎప్పుడయితె మనము మద్యతరగతి వారిని క్రింది తరగతివారితో కలిపితె, మద్యతరగతి వారు మొత్తం రిజర్వేషన్లు బర్తిచేస్తారు, అప్పుడు క్రింది తరగతివారి అబివృద్ది కుంటు పదుతుంది.కాబట్టి సాద్యమయినంత త్వరలో క్రిందితరగతి వారిని మద్యతరగతిలో చేరిస్తె తరువాత క్రింది తరగతివారు ఉండరు కాబట్టి, అప్పుడు మొత్తం రిజర్వెషన్లు మద్యతరగతివారికి వర్తిస్తాయి.
ఇకపోతె ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు అన్ని అందులో చేరుతాయని, జనాలకు అర్దమయే విదంగా ప్రచారం చేయాలి.ఎందుకంటె ఎలాగు ఇప్పూడు ఉన్న తక్కువ కులాల వారి ఆదాయం తక్కువగానే ఉంటుంది కాబట్టి వారికి ఏమి అన్యాయంజరగదు, దీనిగురించి బాగా ప్రచారం చేయాలి, మధ్యతరగతి వారిని మాత్రం అసలు మరువరాదు.

5 comments:

Anil Dasari said...

చిరంజీవి అభిప్రాయాలెలా ఉన్నా ఆర్ధిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లని పునర్నిర్వంచటం మంచిది. అంతకన్నా ముఖ్యం, అవి సరిగా అమలయ్యేలా చూడటం. మనదేశంలో దుర్వినియోగం కాని చట్టం ఒక్కటీ లేదు. 'తక్కువ ఆదాయం కలవారికి రిజర్వేషన్లు' అనగానే ఉన్న ఆదాయాన్ని లేనట్లు చూపి రిజర్వేషన్లు కొట్టేయాలని చూసేవాళ్లు ఎక్కువైపోతారు. వీళ్ల వల్ల నిజంగా అర్హులయిన వాళ్లకి రిజర్వేషన్ లభించకుండాపోవటమే కాకుండా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం పన్ను లాంటివాటి వసూళ్లు కూడా తగ్గిపోతాయి.

రిజర్వేషన్ల వంకతో అర్హతా పరీక్షల మార్కుల శాతాన్ని తగ్గించటం, ఉద్యోగాల్లో కోటాలు ప్రకటించటం వగైరాలు చేయకూడదనేది నా అభిప్రాయం. దానివల్ల లబ్దిదారుల్లో సోమరితనం, నిర్లక్ష్యం పెరగటం వంటి అవలక్షణాలు పొడచూపటమే కాకుండా ఆయా రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోయే అవకాశమూ ఉంది. దీనికి బదులు అర్హులైన వారికి ప్రభుత్వం ఉచిత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి (ఎంసెట్ వంటివాటికి ఉచిత కోచింగ్ లాంటివి కూడా) ఆ రకంగా ధనికవర్గాల విద్యార్ధులతో పోటిపడి చదువుకోగలిగే వాతావరణాన్ని పేద విద్యార్ధులకు ప్రభుత్వమే కలిపించాలి.

తెలుగు జాతి said...

నా ఉద్దేశ్యం కూడా మీరు చెప్పినదే, నా ఉద్దేశ్యంలో రిజర్వేషన్ అంటె ఆర్దికంగా సహయం చేయటమే, మీరు చెప్పినది కొంతవరకు నిజం, కాని మొత్తం కాదు, అలాగ అనుకుంటె మనకు ఆదాయపు పన్ను వచ్చేదేకాదు, ఎమి దాచినా, బుజినెస్ మరియు ఉద్యోగం దాయలేరు, మరియు చట్టాలు గట్టిగా అమలు పరిచి, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వారిని ఉద్యోగం నుండి తప్పించాలి.

మీరు ఒక లెవల్కి వచ్చాక అంటె ఇంటర్మిడియెట్ తరువాత ఆలోచిస్తున్నారు, కాని బీధ వర్గాలలో కొంతమంది స్కూల్ కి పంపకుండా పనికి పంపుతున్నారు

మీరు చెప్పినట్లె నేను ఆలోచిస్తున్నాను, నర్సరి నుండి కాన్వేంట్స్ కి దీటుగా కోచింగ్ ఇవ్వాలి, అది కోంచం కష్టం ఆచరనలో. కాబట్టి ప్రమాణాలు పడిపోకుండా మినిమమ్ క్వాలిఫైడ్ మార్క్స్ పెట్టాలి.

Kathi Mahesh Kumar said...

కాస్త తికమకగా ఉంది. బహుశా ఆర్థికపరమైన రిజర్వేషన్లు అనే ఆలోచన కొత్తదవడం వల్ల అర్థం చేసుకోవడం కష్టం గా ఉందేమో!

మీరు చెప్పేటట్లు చేస్తే పేదల్ని, ‘పేదలు’,‘నిరుపేదలు’,‘అతిపేదలు’ అని విభజించినట్టే మిడిల్క్లాస్ వాళ్ళని సాధారణంగా వ్యవహరించే ‘అప్పర్ మిడిల్ క్లాస్’,‘మిడిల్ క్లాస్’,‘లోయర్ మిడిల్ క్లాస్’ అని అధికారికంగా పెట్టి, రిజర్వేషన్లు అమలు చెయ్యాలన్నమాట.

ఆలోచల చూడ్డానికి బాగానే ఉంది. వ్యవహారంలో మట్టుకూ ఖచ్చితంగా బెడిసికొడుతుందేమో అని నా ఫీలింగ్. ఉద్యొగస్తులూ,మిగతా పనిచేసే వారు (service class)తప్ప మిగతావారి ఆర్థికస్థితి ఖచ్చితంగా కొలవలేని మన వ్యవస్థలో...అర్థిక పరమైన రిజర్వేషన్ నిజంగా అమలౌతుందా?

@అబ్రకదబ్ర, మీరు చెప్పిన సూచనలు సరైనవి. కాకపోతే ఇవి హఠాత్తుగా కాక, ఒక రొక్ బ్యాక్ టైం ఫ్రేమ్ లో పెట్టి అమలు చేస్తే బాగుంటుంది. అటూ,ఇటూ నష్టం రాకుండా ఉండాలంటే ఆ పద్దతే నయం.It has to be done through a process, not as part of an immediate decision.

@తెలుగుజాతి గారూ, మీరు చెప్పిన స్కూలు విధ్య అదో పేద్ద సమస్య. దానికి ప్రత్యేకంగా ఒక Action plan ..ఈ ప్రభుత్వాలకి చిత్తశుద్దీ కావాలి.

Anonymous said...

@తెలుగు జాతి
మీరు చెప్పినవి 100 శాతం ఆచరించదగ్గవి. చాలా మంచి అభిప్రాయాలు వ్రాసారు.

Nrahamthulla said...

ఆంధ్రప్రదేశ్ లో బీ.సీ.గ్రూపుల వర్గీకరణ మరోసారి చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ,తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
42 ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము. ఇన్ని ఏళ్ళ కాలంలో కనీసం ఫలానా కులాలను పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయ లేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి, ఆర్ధికంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి, కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి.షెడ్యూల్డ్ కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు ' ఎ ' గ్రూపులోను, వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని క్రింది గ్రూపులోను చేర్చాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ళకొకసారి మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా హీన కులాల అభివ్రుద్ధి కోసం పేరు పేరు వరుసన నిధులు కేటాయించి అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి.